దేశ సంపద కార్పొరేట్ చేతుల్లోకి పోవడం ఖాయం
సిపిఐ జాతీయ కార్యదర్శి
డాక్టర్ నారాయణ
వరదయ్యపాలెం అక్టోబర్ 29
దేశంలోని సంపద కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపో విధంగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం కేంద్రంలోని సిపిఐ నాయకులు ఏ చిన్ని రాజ్ స్వగృహం లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడని,రైతుల నడ్డివిరిచే విధంగా ఇటీవల వ్యవసాయ బిల్లు ఆమోదించడం జరిగింది అని అదే రీతిలో విద్యుత్తును ఆ దానికి అప్పజెప్పడం ,దేశ సంపద కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని అన్నారు దేశ ప్రధాని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు .తెలంగాణకు చెందిన కర్నూల్ సంతోష్ వీర మరణం చెందితే బీహార్ వాసిగా చెప్పడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని కేంద్రం మీద ఒత్తిడి తీసుకు రాకపోగా తమ కేసుల మాఫీ ఈ దిశగా ప్రధాన మోడీ మోకాళ్ళకు ముక్కు తున్న ఉన్నారని, నాలుగు వేల కోట్ల జీఎస్టీ నిధులు స్వతంత్ర ప్రతిపత్తి ఇలాంటి అంశాలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కులాన్ని ఆస్వాదించడం. అమరావతి రైతులు స్వచ్ఛందంగా న్యాయ పూరితంగా పోరాటం చేస్తుంటే దళిత బి.సి రైతులకు సంకెళ్ళు వేయడం దారుణమని ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని రాజరిక పాలన కొనసాగుతుందని ఆయన వాపోయారు.చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీల తో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అదే రీతిలో వైసిపి పార్టీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజా వ్యతిరేకత తప్పదని ఆయన అన్నారు.ప్రతిపక్ష పార్టీ సైతం రాష్ట్ర సంక్షేమంపై సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన అన్నారు. గతంలో ఆందోళన చేసే చేస్తే అరెస్ట్ చేసే వారని, ప్రస్తుతం గృహనిర్బంధం చేస్తూప్రభుత్వ పాలన సాగుతుందనిఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి కృష్ణమూర్తి ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Post a Comment