కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి మొదలైంది రచ్చ. కొమరం భీమ్ జయంతి సందర్భంగా.. భీమ్ టీజర్ రిలీజ్ చేసిన జక్కన్న అందులో ఎన్టీఆర్ కు టోపీ పెట్టడంతో గొడవ స్టార్ట్ అయింది. అసలు భీమ్ పాత్రకు ఆయన జయంతి రోజు.. ఆ టోపీ పెట్టాల్సిన అవసరం ఏంటనేది ఇంకో విషయం. కానీ.. జక్కన్న చేసిన పనికి మాత్రం తిట్లు తప్పడం లేదు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు.. జక్కన్న రిలీజ్ చేసిన త్రిబుల్ టీజర్ పై సీరియస్ గా ఉన్నారు. ఆ టీజర్ డిలీట్ చేయడంతో పాటు.. సినిమాలో కూడా టోపీ ఉన్న సీన్లు ఉండడానికి వీళ్లేదని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీలను అవమానించినట్లే అవుతుందని.. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని.. రాజమౌళిని త్రిబుల్ ఆర్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన భీమ్ కు వాళ్ల టోపీ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగే రిలీజ్ చేస్తే.. ఆదివాసీల ఆగ్రహం తప్పదన్నారు. థియేటర్లలో గొడవ తప్పదు అని సీరియస్ అయ్యారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఎంపీ సోయం బాపూ రావు.
Post a Comment