*అనంతసాగర మండలంలో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక పర్యటన*
*అనంతసాగరం మండలంలో వాలంటరీ వ్యవస్థ మెరుగు పడాలి*
*అనంతసాగరం మండలం లోని సచివాలయాల సిబ్బంది మండల అధికారుల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.* *అనంతసాగరం మండలంలోని రేవూరు , మినగల్లు , పాత దేవరాయ పల్లె, అనంతసాగరం లో శనివారం జె.సి.ప్రభాకర్ రెడ్డి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల పర్యవేక్షణ పై సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై సిబ్బంది నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శలపై మండిపడ్డారు.సచివాలయాలను సందర్శించే బాధ్యత ఎంపిడిఓకి ఉందని దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు దేవరాయపల్లి సచివాలయంలో వాలంటీర్లను ప్రశ్నించగా ప్రక్కనే ఉన్న డాక్టర్ ను ఎప్పుడైనా మీరు చూశారా అని వాలంటీర్ల ను అడిగారు. దీనిపై ఒక వాలంటీర్ డాక్టర్ ను మేము ఎప్పుడు చూడలేదని వాలంటీర్ల చెప్పడం గమనార్హం. మండలంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ మరింత మెరుగుపడాలన్నారు. సచివాలయం సిబ్బందికి, వాలంటీర్ల కు అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు నష్ట పోతున్నారని వాలంటీర్ల కు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని మండల అధికారులకు ఆయన సూచించారు. మండల అధికారులు పనితీరు మెరుగు పర్చుకోపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ , ఎంపీడీవో మధుసూదన్ రావు పాల్గొన్నారు*
Post a Comment