*🔵 నెల్లూరు ఆర్& బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలతో మంత్రులు భేటి*
*⚪ మంత్రులు సమావేశంలో వైసీపీ ముఖ్యనేతలు హాజరు*
*🟢 కోట గ్రామాల్లో ముఖ్య మైన సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన వినోద్ రెడ్డి*
*🔵 కోటలో త్వరలోనే డ్రైనేజ్ కాలువకు మోక్షం*
*⚪ మండల కేంద్రంలో ఆర్&బి రోడ్లును బాగుచేయండి*
🟢 *వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి*
*వార్త✍️మీజూరు మల్లి✍️: నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంగళవారం జిల్లా ఇంచార్జ్ మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,వైసీపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, జిల్లా* *ఇంచార్జ్ సజ్జల రామకృష్ణ రెడ్డి లు నెల్లూరు జిల్లాలోని అన్నీ నియోజకవర్గ శాసనసభ్యులు, వైసీపీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఒక్కొక్క నియోజకవర్గ శాసన సభ్యుడు తో పలు సమస్యలు పై మంత్రులు సుదీర్ఘ చర్చలు జరిపారు, ఈ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతలు యల్ల సిరి గోపాల్ రెడ్డి, నల్లప రెడ్డి వినోద్ రెడ్డి లు గూడూరు,కోట పట్టణంలోనీ ప్రధాన సమస్యలు మంత్రులు దృష్టికి తీసుకెళ్లారు, కోట పట్టణంలో ఎన్నో ఏళ్ళు నుండి డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా ఉంది అనీ, దింతో కోట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనీ వెంటనే సుమారు కోటి రూపాయలు మంజూరు చేసి డ్రైనేజీ కాలువ పనులు చేపట్టాలి అనీ వినోద్ రెడ్డి మంత్రులను కోరారు,అదేవిధంగా కోట పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు గుంతలు మయంగా ఉండటంతో వర్ష కాలంలో రోడ్లపై వర్షం నీరు నిలవడంతో ఆర్ అండ్ బి రోడ్లు చెరువుల ను తలపిస్తున్నాయి అనీ వాహన దారులు,ప్రజలు అవస్థలు పడుతున్నారు అనీ ఆర్ అండ్ బి అధికారులు మాత్రం రోడ్లు గురుంచి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు,వెంటనే మంత్రులు స్పందించి ఆర్ అండ్ బి రోడ్లను బాగుచేయలని వినోద్ రెడ్డి కోరడంతో వెంటనే స్పందించిన మంత్రులు డ్రెనేజ్ కాలువలకు నిధులు,ఆర్ అండ్ బి రోడ్లు బాగుచేస్తాం అనీ హామీ ఇచ్చినట్లుగా వినోద్ రెడ్డి తెలిపారు, యల్లసిరి గోపాల్ రెడ్డి గూడూరు రైల్వే ఫ్లెఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేయాలని మంత్రులను కోరారు,*
Post a Comment