గూడూరు సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ అవినీతి అక్రమాలు,దౌర్జన్యల పై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ,రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ను కోరుతున్నాం అనీ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య, ఎమ్మార్పీఎస్ ఉద్యోగుల సంఘం నేత కాలువ శ్రీధర్, నెల్లూరు జిల్లా మాల మహానాడు అధికార ప్రతినిధి పల్లె కోటేశ్వరరావు, రజక సంఘం అధ్యక్షుడు ఎల్ వి సుబ్బయ్య లు డిమాండ్ చేశారు,
బుధవారం గూడూరు కటకరాజా వీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ నందు గూడూరు సబ్ కలెక్టర్ రొనంకి గోపాల కృష్ణా అవినీతి ,అక్రమాలు,దౌర్జన్యం పై మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, రజక సంఘాలు నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పై గూడూరు డివిజన్ లో 17 రకాల అభియోగాలు తమకు అందాయి అనీ ఆ అభియోగాలు పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కు పిర్యాదు చేసి సబ్ కలెక్టర్ అక్రమాలు పై ఏ సి బి విచారణ చేయాలని కోరుతాం అనీ ఆయన వెల్లడించారు,
ఒక్క గౌరవప్రదమైన సబ్ కలెక్టర్ హోదా లో ఉండి జిల్లా, గూడూరు డివిజన్ అట్రాసిటి కమిటీ పై పనిబాట లేని,చిల్లకూరు, గూడూరు తహశీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బ్రోకర్ పనిచేసే బైరెప్ప అనే దళిత ద్రోహికి ముడుపులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు,
Post a Comment