తప్పిపోయిన చిన్నారుల ను తమ వారి చెంతకు చేర్చడంతో పాటు వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2015 జూలై ప్రవేశ పెట్టిన ఆపరేషన్ మస్కాన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల మందిని తమ కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం జరిగిందని ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారుల డీజీపీ గౌతమ్ సవాంగ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేటలో బుధవారం ఆపరేషన్ మస్కాన్ చేపట్టి పలువురు బాల కార్మికులకు బంగారు భవిష్యత్తు బాటపై అవగాహన కల్పించి వారిని సంక్షేమ గృహాలకు తరలించడం జరిగిందని కాసులు శ్రీనివాసరావు పేర్కొన్నారు . అభాగ్యులైన చిన్నారుల చేత వెట్టి చాకిరికి పూనుకున్న వారికి కఠిన శిక్షార్హులు అవుతారని, అనాథలు ఆసరా లేక వివిధ కారణాల వల్ల బాల్యంలోనే నరకయాతన లోనవుతూ నలిగిపోతున్న చిన్నారులకు రాష్ట్ర పోలీసుశాఖ అండగా నిలుస్తుందన్నారు. చట్ట వ్యతిరేకంగా Act 1986 ప్రకారం బాల కార్మికులను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని పలు మాంస విక్రయ దుకాణాలు వెల్డింగ్ మెకానిక్స్ పూల దుకాణాల్లో పనిచేస్తున్న పలువురిని గుర్తించి వారిని ప్రభుత్వ సంక్షేమ గృహాలకు తరలించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు .
Post a Comment