అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎబివిపి నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా నగర నడిబొడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి జయంత్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం నేటి తరాలకు ఆదర్శనీయం అనుసరణీయం అన్నారు. మహాత్ముని అడుగు జాడల్లో పయనించాలనీ, ఆయన ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలని ఆయన యువతకు
సూచించారు. సత్యం, అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన జాతిపిత నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. అలానే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా ఆయనను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ రాజశేఖర్, నగర సహాయ కార్యదర్శులు సాయికృష్ణ , భాషా, భాను, జశ్వంత్, రాజేశ్, పవన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment