మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని, ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లల్లో కూడా రావాలని ఆకాంక్షించారు. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తున్నామని ప్రకటించారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలను తెరవాలనుకుంటున్నామని వెల్లడించారు. విద్యా వ్యవస్థను మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చేందుకు అడుగులు వేశామని తెలిపారు. పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని స్కూల్‌కి వెళ్లాలన్నారు. జనవరి 9 నుంచి అమ్మ ఒడి రెండో దఫా కార్యక్రమాన్ని చేపడుతామని జగన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో మంచిపనికి జగన్ శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు.
Post a Comment