సుఫ్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా?
అసలే అక్రమ కేసులు. ఆపై మానవ హక్కుల ఉల్లంఘన.
ముఖ్యమంత్రి మానవ హక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలి.
-నారా చంద్రబాబు నాయుడు
కృష్ణాయపాళెం దళిత, బిసి, తదితర రైతులపై ఎస్సీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదని పిర్యాదుదారుడైన ఈపూరు రవి పోలీసులను కోరారు. తాను పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోమని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది. రైతు విద్రోహ చర్య అవుతుంది. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉన్నది. ముఖ్యమంత్రి ఈ మానవహక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలి.
Post a Comment