రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి రెండు రోజుల ముందు నుంచే పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏ.ఎస్ పేట పర్యటనలో ముందస్తుగానే 49 వసంతాలు పూర్తి చేసుకున్న మంత్రిగారికి ఏ.ఎస్ పేట మండల నాయకులు, వైసీపీ కార్యకర్తలు 49 కేజీల భారీ కేక్ ను కట్ చేయించారు. నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలోనూ పుట్టిన రోజు సంబరాలు జరిగాయి. ఆత్మకూరు పట్టణ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మేకపాటి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ యువనాయకుడు రఫీ రచించి, రూపొందించిన పాటను మంత్రి గౌతమ్ రెడ్డి రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో 15 రోజుల ముందు నుంచే మంత్రి మేకపాటి అభివృద్ధిని తెలియజేస్తూ ఉన్న మంత్రి ఫోటోలతో పుట్టిన రోజుకు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.
పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని నెల్లూరు క్యాంప్ ఆఫీస్ లో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి కలిశారు. నవంబర్ 2వ తేదీన పుట్టినరోజు జరుపుకోబోతున్న మంత్రి మేకపాటికి ఆయన ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
Post a Comment