నిరుద్యోగులకు శుభవార్త : 9640 పోస్టుల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐబీపీఎస్.....


మనదేశంలో నిరుద్యోగులకు కొరవ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక శుభవార్త. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం చేయడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లలో ఎక్కువ మంది బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తారు. అలా ఎదురుచూసే వారి ఆశలు నెరవేరే సందర్భం వచ్చింది.నిరుద్యోగులకు ఐబీపీఎస్ ఒక శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాలకు గత నెలలలోనే గడువు ముగిసిన సంగతి తెలిసిందే.అయితే కొంతమంది దరఖాస్తు చేసుకొని వారికీ ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది.

https://ibps.in/ వెబ్సైటు ద్వారా అభ్యర్థులు నవంబర్ నెల 9వ తేదీ వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకి సంబంధించి, ఆఫీసర్‌ పోస్టులకు 2020 డిసెంబర్ 31న, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021 సంవత్సరం జనవరి 2,4 తేదీలలో పరీక్షలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలలో ఖాళీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 470 ఖాళీలు ఉండగా ఏపీలో 366 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

9,640 ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) ఉద్యోగాలు 4,624, ఆఫీసర్‌(అసిస్టెంట్ మేనేజర్‌) - 3,800 ఉద్యోగాలు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837 ఉద్యోగాలు, ఆఫీసర్‌ (స్కేల్‌-3) 156 ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ 100 ఉద్యోగాలు, ఐటీ ఆఫీసర్ 58 ఉద్యోగాలు, లా ఆఫీసర్ 26 , మార్కెటింగ్ ఆఫీసర్‌ 8, ట్రెజరీ మేనేజర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా స్కేల్ 1 ఆఫీసర్ల భర్తీ జరుగుతుంది. ఇకపోతేఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 175 రూపాయలు మిగిలిన వారికి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget