విద్యుత్ శాఖ సూపరెంటెండింగ్ ఇంజనీర్ కె. విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . viఅక్కడ విద్యుత్ సేవలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు, సచివాలయాల ద్వార దాదాపు 56 రకాల సేవలను వినియోగదారులు పొందవచ్చని, ప్రభుత్వం తీసుకొనివచ్చిన్న ఈ సచివాలయం వ్యవస్థ ద్వార గ్రామ స్థాయి వరకు ప్రతి వినియోగదారునికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొనివస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ కు సంబంధించిన సేవలలో భాగంగా గృహాలకు, వాణీజ్యం లకు కొత్త కనెక్షన్స్ గురించి మరియు కేటగిరీ మార్పు, పేరు సవరణ, ఫేజ్ మార్పిడి మొదలగున సేవలు గురించి కంప్యూటర్ లో ఎలా చేస్తున్నారని డిజిటల్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సచివాలయ వ్యవస్థ లో ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. ప్రతి సచివాలయానికి ఎనర్జీ అసిస్టెంట్ ఒకరు ఉంటారని లేనిచోట మా రెగ్యులర్ స్టాఫ్ కు కూడ సచివాలయలను కేటాయించామని తెలిపారు, విద్యుత్ శాఖ కు సంబందించిన సచివాలయాలలో అప్లై చేసిన దరఖాస్తులను ప్రతిరోజు మోనిటరింగ్ చేస్తున్నామని తెలిపారు.ఈ సచివాలయాలకు సంబంధించిన ఎనర్జీ అసిస్టెంట్లు వి.అంకయ్య, షేక్.సుభాన్ ల పనితీరును అడిగి తెలుసుకున్నారు, ఈ తనిఖీలో ఏడిఈ షేక్. అల్తాఫ్, ఏఈ ఏ.అశోక్, జూనియర్ ఇంజనీర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు
Post a Comment