మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే మీరు రూ.15,000 కన్నా తక్కువ జీతం తీసుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మీకోసం అదిరిపోయే స్కీమ్ అందిస్తోందని తెలిపారు. అయితే ఆ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన. ఈ పథకంలో చేరడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చునని తెలిపారు.
అయితే శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన వారు నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చునని నిపుణులు తెలిపారు. ఇక ప్రతి నెలా ఈ మొత్తం మీ అకౌంట్‌లోకి వచ్చి చేరుతుందన్నారు. శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన వారు ఏడాదికి రూ.36,000 పొందొచ్చునన్నారు. ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. 60 ఏళ్లు దాటిన తర్వాతనే పెన్షన్ అందిస్తారని తెలిపారు.
అంతేకాదు నెలకు రూ.3,000 పొందాలని భావిస్తే మాత్రం మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలని తెలిపారు. ఇక రూ.55 నుంచి రూ.200 వరకు ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. మీ వయసు ప్రాతిపదికన మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా మారతాయి. అదే మీరు 30 ఏళ్ల వయసులో శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకంలో చేరితే నెలకు రూ.100 చెల్లించొచ్చునన్నారు. 40 ఏళ్ల వయసులో చేరితే రూ.200 కట్టాల్సి వస్తుందని తెలిపారు. 18 ఏళ్ల వయసులో పథకంలో చేరిన వారు సంవత్సరానికి రూ.660 కడితే సరిపోతుందన్నారు. అంటే మీరు 42 ఏళ్ల వయసులో మొత్తంగా రూ.27,720 డిపాజిట్ చేస్తారు. తర్వాత మీకు ప్రతి నెలా రూ.3,000 వస్తాయని తెలిపారు.
అంతేకాక భారతీయ పౌరులు ఎవరైనాసరే శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరొచ్చునని తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు అర్హులు. అంతేకాదు అసంఘటిత రంగంలో పని చేసే వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చునన్నారు. అయితే రూ.15 వేల కన్నా తక్కువ జీతం ఉండాలి. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారు అనర్హులు. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరొచ్చునని తెలిపారు. ఇక 18002676888 నెంబర్‌కు కాల్ చేసి స్కీమ్ వివరాలు పొందొచ్చునని తెలియజేశారు.
Post a Comment