అమెరికాలో దారుణం జరిగింది. మూడేళ్ల టెక్సాస్ చిన్నారి తన పుట్టినరోజు వేడుకలో తనకు దొరికిన తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో ప్రాణాలు కోల్పోయాడు. హూస్టన్ కు ఈశాన్యంగా 25 మైళ్ల (40 కిలోమీటర్లు) పోర్టర్ లో శనివారం ఈ ఘటన జరిగింది. అక్కడ అందరూ కూడా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు. పెద్దలు కార్డులు ఆడుతున్నప్పుడు తుపాకీ కాల్పులు విని చూడగా…
బాలుడి ఛాతీకి తుపాకీ గాయం అయింది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల జేబులోంచి పడిపోయిన పిస్టల్ ను బాలుడు గుర్తించి ఆడుకున్నాడని అప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఏడాది మొత్తంలో 229 పిల్లలకు తుపాకీ గాయాలు కాగా 97 మంది మరణించారు. యుఎస్ రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా తుపాకీలను సొంతం చేసుకునే హక్కు ఉంది.
Post a Comment