నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ప్రాంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం పర్యటించారు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రహదారులతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు.. రూరల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ మిట్ట ప్రాంతంలో అత్యధికంగా రోజువారి కూలి పనులు చేసుకునే కార్మికులు, పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు.. ఈ ప్రాంతం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకనే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు .నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ కు ఈ ప్రాంత సమస్యలను ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేసామన్నారు...  25 వ డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని కోటం రెడ్డి పేర్కొన్నారు... రూరల్ లోని అన్ని ప్రాంతాల పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న  ఎమ్మెల్యే కోటంరెడ్డి డివిజన్ ను ప్రస్తావించినప్పుడు 24వ డివిజన్ గా పేర్కొనడం గమనార్హం... తిరిగి ఆయన 25 వ డివిజన్ గా గుర్తించి మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు సరిచేశారు*

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget