ఏపీ రైతులకు పండుగ.. రూ.2000 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ముందుగా చెప్పినట్లుగానే 'వైయస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌' పథకం రెండో సంవత్సరం, రెండో విడత నిధులను విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికీ... రూ.2000 చొప్పున... వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడుతల్లో మొత్తం రూ.13,500 చెల్లిస్తూ... ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనుంది. ఈ డబ్బుతో రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేందుకు వీలు కానుంది. ఖరీఫ్ సీజన్‌లో రూ.7500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం... ఆగస్టులో రూ.2000, ఇప్పుడు మరో రూ.2000 చొప్పున ఇచ్చి... మిగతా... రూ.2000ను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సమయంలో ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీసులో... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... కంప్యూటర్‌లో బటన్ నొక్కారు. అంతే... క్షణాల్లో డబ్బు... రైతుల అకౌంట్లలోకి వెళ్లిపోయింది.

అరకోటి మందికిపైగా రైతులకు దాదాపు రూ.6,797 కోట్లను వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద అందిస్తున్నారు. రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటే... వాటిలో ప్రతి మూడింటిలో ఒక కుటుంబానికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు రూ.13500 ఇచ్చిన దాఖలాలు లేవని వివరించింది.నిజానికి ప్రభుత్వం ఈ పథకం కింద... ప్రతి రైతుకూ ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక... ఐదేళ్లు ఇవ్వాలని డిసైడైంది. అలాగే... మరో రూ.1000 పెంచి... ఏడాదికి రూ.13500 ఇస్తోంది. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు కేవలం అర హెక్టారు లోపే భూమి ఉందన్న ప్రభుత్వం 1.25 ఎకరాల్లోపు ఉన్నవారే 50 శాతం రైతులు ఉన్నారని తెలిపింది. అలాగే... 2.5 ఎకరాల్లోపు రైతులు 70 శాతం ఉన్నారని వివరించింది.

రైతు భరోసా రెండో విడత సొమ్ముతోపాటు ఈఏడాది, ఈ సీజన్‌లో అకాల వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన 1.66 లక్షలమంది రైతులకు రూ.135.73 కోట్లను కూడా వారి ఖాతాల్లోకి కూడా జమచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులో నష్టపోయిన రైతులకు ఇప్పుడు చెల్లిస్తున్నట్లు వివరించింది. అక్టోబరులో జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారవుతున్నాయన్న సర్కారు... వారికి నవంబర్‌లోపే డబ్బు ఇస్తామని హామీ ఇచ్చింది.
 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget