టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్ జాబితాలు విడుదల చేయాలి: STU డిమాండ్........
శుక్రవారం ఉదయం ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం తదితరులతో సహా , జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డిని కలసి వివిధ అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా గంటా మోహన్ మాట్లాడుతూ ఈ ఎస్ ఆర్ నమోదు లో సర్వీస్ రెగ్యులరైజేషన్ వివరాలు నమోదు చేయలేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల సీనియార్టీ విషయంలోనూ పదోన్నతుల విషయంలోనూ గందరగోళం నెలకొంటుందని తెలిపారు.సంవత్సరాల తరబడి ఈ జాబితాలు విడుదల చేయకపోవడం సరికాదన్నారు.అదేవిధంగా టీచర్లకు సంబంధించి anticidence verification ,పూర్తి అయినప్పటికీ .. డి ఇ ఓ కార్యాలయ వుత్తర్యులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి ,త్వరగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.డి ఇ ఓ నరసింహా రెడ్డి స్పందిస్తూ.. వీలైనంత త్వరగా సర్వీస్ రెగ్యులరైజేషన్ జాబితాలు విడుదల చేస్తామని తెలిపారు. Anticidence verification ఉత్తర్వులు తమ పరిధిలో పెండింగ్ వుంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు.తాజాగా దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిపాదనలను వెంటనే పోలీసు శాఖకు పంపాలని సిబ్బందికిసూచించారు.అందుబాటులో ఉన్న వివరాలతో వీలైనంత వరకు ఈ ఎస్ ఆర్ ఆర్ నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము .నడుచుకుంటామని తెలిపారు.
Post a Comment