ఏపీ బీజేపీ నాయకురాలు సాధినేని యామినిపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఇటీవల అయోధ్యలో జరిగిన రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
దీంతో సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యామినిపై పోలీసులు ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ విమర్శలపై టీటీడీ ఇదివరకే వివరణ ఇచ్చింది. అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో శ్రీవారి కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని, కళ్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని అందుకే ఆ సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడంలేదని తెలిపిన సంగతి తెలిసిందే.

Post a Comment