- మాజీ కమిషనర్ టి. బాపిరెడ్డి
కుటుంబంలోని సన్నిహితులు కరోనాకు బలయ్యారు... మరికొంతమంది సభ్యులు వ్యాధి బారిన పడి కోలుకుంటున్నారు... ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు, ఆత్మీయులకు దగ్గరగా ఉండాలని స్వచ్ఛందంగా ఒంగోలుకు బదిలీ కోరానని తన బదిలీలు ఎలాంటి రాజకీయ వత్తిడులు లేవని నెల్లూరు నగర పాలక సంస్థ మాజీ కమిషనర్ టి.బాపిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన ను శుక్రవారం ఆయన విడుదల చేసారు. కమిషనర్ బదిలీ వెనుక రకరకాల రాజకీయ కోణాలు, నేతల వత్తిళ్ళు ఉన్నాయంటూ గత కొన్నిరోజులుగా వార్తా మాధ్యమాల్లో వస్తున్న విషయాలన్నీ అవాస్తవాలన్నారు.ప్రకాశం జిల్లాకు బదిలీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులను తానే స్వయంగా అభ్యర్ధించానన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు అందించిన సమయంలో సహకరించిన అన్ని విభాగాల అధికారులు, కార్పొరేషన్ సిబ్బందికి బాపిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.