ఇళ్లలోనే విగ్రహాలు..తొలిరోజే నిమజ్జనం బహిరంగ ప్రదేశాల్లో మంటపాల ఏర్పాటుకు అనుమతులు లేవు వాకాడు సి ఐ నరసింహ రావు

ఇళ్లలోనే విగ్రహాలు..తొలిరోజే నిమజ్జనం

➡️  బహిరంగ ప్రదేశాల్లో మంటపాల ఏర్పాటుకు అనుమతులు లేవు

➡️ ప్రతీ ఒక్కరూ కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి

➡️ ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తే కఠిన చర్యలు

➡️
వాకాడు సి ఐ నరసింహ రావు వెల్లడి

  ''ఇంట్లోనే వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలని. కరోనావైరస్ కారణంగా బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు వద్దుఅనీ. ఎక్కడా కూడా వినాయక మండపాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనీ. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవు. ప్రజలు సహకరించాలి'' అని వా కాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహరావు కోరారు,*

 గురువారం సిఐ నరసింహ రావు ఓ ప్రకటన విడుదల చేశారు, ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ వినాయకచవితి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మంటపాల ఏర్పాటుకు అనుమతి లేదని, ఇళ్లలోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలని ప్రభుత్వం తెలిపింది అన్నారు, ఉన్నత అధికారులు ఈ విషయమై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారుఅని తెలిపారు .

 "నియమ // నిబంధనలు"

☀️ ఇళ్లలో రెండు అడుగులలోపు విగ్రహాలనే ఏర్పాటు చేసుకుని, ఆరోజే నిమజ్జనం చేయాలి.

☀️ నదులు, చెరువులకు ఊరేగింపుగా వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించరు.

 ☀️ ఆ రోజు అన్ని ఆలయాల్లో పదిమంది భక్తులతోనే పూజలు చేయాలి. భౌతికదూరం పాటించాలి.

☀️ పూజా సామగ్రి కొనుగోళ్లలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి .

  ☀️విక్రయదారులు సైతం దుకాణాల వద్దఎక్కువమంది గుమిగూడకుండా చూసుకోవాలి.

 ఈ నెల 22న వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఎక్కడా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని  సి ఐ నరసింహా రావు సూచించారు.  కరోనా నేపథ్యంలో ఇళ్లల్లో మాత్రమే పూజలు చేసుకోవాలన్నారు. ఎవరైనా అతిక్రమించి విగ్రహాలు నెలకొల్పితే నాన్‌బెయిల్‌బుల్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడంతోపాటు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget