కరోనా మరణాలను ఆపుదాం* ..... *పాజిటివ్ కేసుల బాధ్యత గ్రామ, మండల స్థాయి అధికారులదే* ... *: జిల్లా కలెక్టర్* ....

*కరోనా మరణాలను ఆపుదాం* .....
 *పాజిటివ్ కేసుల బాధ్యత గ్రామ, మండల స్థాయి అధికారులదే* ...
 *: జిల్లా కలెక్టర్* .....

 ......:* కరోనా వ్యాధి తో ఇబ్బంది పడుతున్న వారి పట్ల కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇందుకు పూర్తి భాధ్యత వాలంటీర్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది తో పాటు మండల స్థాయి అధికారులు వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా సచివాలయం లోని కలెక్టర్ చాంబర్ నుండి ఎం పి డి ఓ లు తహశీల్దార్లు, డాక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెస్పిరేటరీ వ్యవస్థ 24 కు పైన, శ్యాచురేషన్ 95 కంటే తక్కువ ఉన్న వారి ఆరోగ్య విషయం లో ఏ ఎన్ ఎం లు, వాలంటీర్ లు జాగ్రత్త వహించాలని, అదే విధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరం అయితే వారిని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి బ్లడ్ షుగర్, ఇతర ఇబ్బందులు ఏవైనా ఉన్న వాటిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, పరిస్థితిని బట్టి వారిని ట్రయాజ్ సెంటర్ లేదా ఆసుపత్రుల కు పంపల్సి ఉంటుందని అన్నారు. అయితే పరీక్షల నిర్వహణ లో ఆలస్యం జరిగినా లేదా వ్యాధిగ్రస్తులను ఆసుపత్రులకు పంపడం లో ఆలస్యం జరిగినా ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుందని , ఎటువంటి పరిస్థితీల్లోనూ ఎవరూ మరణించకుండా చూడాలన్నారు. ఆదే విధంగా పరీక్షా ఫలితాలు బాధితునితో పాటు వాలంటీర్, ఏ ఎన్ ఎం, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత డాక్టర్ మరియు ఎం పి డి ఓ లకు మెసేజ్ ల రూపం లో రావడం జరుగుతుందని వెంటనే వారి పట్ల తగు చర్యలు తీసుకోవాలని బాధితుని పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంటే లేదా రెస్పిరేటరీ వ్యవస్థ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అతనిని వెంటనే ఆసుపత్రికి పంపాల్సి ఉంటుందని అన్నారు. పాజిటివ్ కేసు నమోదు అయినా పరిస్థితి అంత ఇబ్బందికరంగా లేకపోతే ట్రయాజ్ సెంటర్ కు పంపితే వారి అక్కడ పరీక్షలు నిర్వహించి ఆసుపత్రికి కానీ లేదా కోవిడ్ కేర్ సెంటర్ కు కానీ పంపడం జరుగుతుందన్నారు. పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి విషమం గా ఉంటే వెంటనే 108 వాహనాల ద్వారా ఆసుపత్రులకు పంపాలని ఇందులో ఎటువంటి అలక్ష్యం వహించినా చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వైద్య సేవలు లేదా బాధితుదిని తీసుకుని రావడానికి మినీ వాహనాలను ఉపయోగించాలన్నారు. ఎవరైనా వ్యాధిగ్రస్తుడు నేరుగా ఆసుపత్రికి వెళ్లారంటే అందుకు బాధ్యత ఆ గ్రామం లో పని చేసే ఉద్యోగులదే అన్నారు. తమ ఆరోగ్య సమస్య గురించి వారు చెప్పినా లేదా సమీప ఆరోగ్య కేంద్రం లో వారు పరీక్షలు చేసుకున్నా వారిని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు వైద్య సిబ్బంది పై ఉంటుందన్నారు. అలా ఎక్కడైనా పొరపాటు జరిగితే బాధితుడు నేరుగా ఆసుపత్రికి వెళ్ళినా లేదా సకాలం లో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేక పోయిన అతని పరిస్థితి తీవ్రతరం అవుతుంది కాబట్టి ముందే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి వ్యవస్థను ఎప్పటికప్పుడు మండల స్థాయిలో ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, డాక్టర్లు, సమీక్షిస్తుండాలన్నారు. ఎవరైనా ఎక్కువమంది పాజిటివ్ బాధితులను ఆసుపత్రికి పంపాల్సి ఉంటే ఆ ఏరియా కు సంబంధించిన వైద్యాధికారులను సంప్రదించి ఏ కోవిడ్ ఆసుపత్రిలో ఖాళీలు ఉన్నాయో అక్కడకి పంపాలన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్ కు కానీ ట్రయాజ్ సెంటర్ కు కానీ పంపకూడదని వారిని కాపాడడమే ఉద్దేశ్యం గా వారిని నేరుగా డాక్టర్ సూచించిన కోవిడ్ ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా గర్భిణీ మహిళలు వివిధ వ్యాధులతో పాటుకరోనా వ్యాధి తో బాధపడుతున్న వృద్ధుల విషయం లో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్ అన్నారు. ర్యాపిడ్ అంటిజెన్ కిట్లు, వి ఎల్ ఎం, వి టి ఎం లను అతి జాగ్రాత్తగా ఉపయోగించాలని, రెండు మండలాలకు ఒక మినీ వాహనం ఉపయోగించుకోవాలని ప్రస్తుతం కేసులు భారీ స్థాయిలో గ్రామీణ స్థాయిలో నమోదు కావడం వల్ల ఎప్పటికప్పుడు భాధితులను తరలించేందుకు వీలుగా ఉంచుకోవాలని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 108 వాహనాన్ని ఉపయోగించాలన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget