సైబర్ నేరాలు, అవగాహనా, రక్షణ గురించి సైబర్ నిపుణుల చే రాష్ట్ర సి.ఐ.డి వారిచే వెబినార్ ల నిర్వహణ..
సైబర్ నేరాల నియంత్రణకు దోహదపడే "ఈ-రక్షాబందన్ " పట్ల అవగాహన పెంచుకోండి... జిల్లా ఎస్.పి ఎస్.సెంథిల్ కుమార్......
రాష్ట్రంలో ఉన్న మహిళలు, బాల బాలికలు, ప్రజలు సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా రక్షణగా రాష్ట్ర పోలీసు-సి.ఐ.డి విభాగం మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ వారు రూపొందించిన "ఈ-రక్షాబందన్ " కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఆగస్టు 3 న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ-రక్షాబంధన్ కార్యక్రమం ప్రారంభం అయ్యిందని, సైబర్ నేరాల నియంత్రణకు ఈ-రక్షాబంధన్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. సైబర్ నేరాలపై మహిళలు, బాలబాలికలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తారన్నారు. ఈ నెలలో ఆన్‌లైన్ కార్యకలాపాలు సైబర్ / ఆన్‌లైన్ భద్రతా అవగాహనను వెబ్‌నార్లు, రేడియో ప్రోగ్రామ్‌లు, నిపుణుల నుండి సైబర్ చర్చలు మరియు సర్వేలు, క్విజ్, నినాద రచన పోటీలు వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడుతాయన్నారు. మహిళలు, చిన్నారులు సైబర్ నేరాల వలలో చిక్కకుండా చైతన్యం తెచ్చేందుకు ప్రారంభించిన ఈ-రక్షాబంధన్ లో భాగంగా ఆగస్ఠు చివరి వరకు క్రమం తప్పకుండా ప్రతీరోజూ రాష్ట్ర సి.ఐ.డి విభాగం వారు యూ ట్యూబ్ లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రస్తుత పోకడలు అర్థం చేసుకుని భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమం లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి సైబర్ నిపుణుల చే రాష్ట్ర సి.ఐ.డి విభాగం వారి యూ ట్యూబ్ ఛానల్ లో 4 వ తేది న సైబర్ బుల్లీయింగ్ ( సైబర్ బెదిరింపులు), 5 వ తేది డిజిటల్ ప్యారెంటింగ్, 6 వ తేది సోషల్ మీడియా ఆధారిత నేరాల గురించి అవగాహనా, 7 వ తేది ఆన్లైన్ సమాచారనిర్వహణ గురించి విజయవాడ నుండి వెబినార్ ను నిర్వహించారు. ఈ వెబినార్ కార్యక్రమం ను జిల్లా వ్యాప్తంగా మహిళలు,బాలబాలికలకు, విద్యార్థులు లైవ్లోవీక్షించించుచున్నారుపైతెలిపినవిషయాలపై సైబర్ నిపుణులు, పోలీసు ఉన్నతఅధికారులతోసవివివరణ,ఉదాహరణలతో AP CID డిపార్టుమెంటు చేనిర్వహిమ్పబడుచున్న Youtube ఛానల్ ద్వారా ప్రసారం చేయుచున్నారు. సైబర్ నేరాలు, వాటి స్వరూపం, వాటిని ఎలా ఎదుర్కోవాలో, అందుకు అవసరమైన మెళకువలను వెబినార్ లో సైబర్ నిపుణులు చే అవగాహన కల్గింస్తున్నారు.
Post a Comment