నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోవిడ్ వారియర్స్ కు వెల్కం పలికిన సిఐ.

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం
కోవిడ్ వారియర్స్ కు వెల్కం పలికిన సిఐ.                  పూలవాన కురిపించిన సిఐ. హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు ప్రజలు.                         గతనెలలో కోవిడ్ బారినపడి కోలుకున్న మనుబోలు పోలీసులకు గురువారం రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. దీనికి తోడు సిబ్బంది పూలవాన కురిపించడంతోపాటు మండలప్రముఖులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ  గతనెలలో అనుకోని పరిస్థితి లలో ఎస్ఐతోపాటు 13మంది పోలీసులు కరోనాబారిన పడి ఎస్పీ పర్యవేక్షణలో నెల్లూరు ఐసోలేషన్ హోం క్వారెంటైన్లు పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మరలా విధులకు హాజరవడం పిఎస్ కు కళవచ్చిందన్నారు. పోలీసు ఉన్న తాధికారుల పర్యవేక్షణలో పోలీసులకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐ  సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమకు కరోనాసోకినప్పటి నుండి ప్రతినిత్యం సిఐ మా బాగోగులు అడిగితెలుసుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవారన్నారు.  కరోనా సోకితే చనిపోతాం అనే అపోహ నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. మా ఉన్నతాధికారుల సహకారంతో మనోనిబ్బరాని పాటించి కరోనా జయించామన్నారు. అక్కంపేట మాజీ సర్పంచ్ ఎన్ కిరణ్ రెడ్డి కరోనా బారిన పడికోలుకున్న పోలీసులకు డ్రైఫుడ్ అందచేశారు. అంతకముందు సిఐ కరోనా వారియర్స్ కు పూలమాలవేసి మిఠాయిలు పంచిపెట్టారు. సిబ్బంది పూలవర్షం కురిపిస్తూ జయహో కరోనా వారియర్స్ అంటూ నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్ అంతా పండగ వాతావరణం నెలకొంది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget