జిల్లాలో కోవిడ్ పడకలు పెంచండి .... నాన్ కోవిడ్ కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి
కోవిడ్ కు సంబందించి ప్రైవేట్ ఆసుపత్రి లు ప్రభుత్వం నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి... దీనిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు
కోవిడ్ బాధితుల నుంచి ప్లాస్మా ను సేకరించే ప్రక్రి య పై మరింత అవ గా హన తీసుకునిరండి...
కోవిడ్ బాధితులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందివ్వండి
- సమీక్షలో
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ళ కాళి కృష్ణ శ్రీనివాస్ (నాని)*
: జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పడకల సామర్థ్యం పెంపునకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు ఆళ్ళ కాళి కృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తా ను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్ వి సె నేట్ హాల్ లో జిల్లాలో కోవిడ్ 19 నియంత్రణకు చేపట్టిన చర్యలపై మరియు రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖా మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు కె.నారాయణ స్వామి , రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖా మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు సమీక్షలో భాగంగా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా పడకలను పెంచాలని ఆదేశించారు. కోవిడ్ కారణంగా నాన్ కోవిడ్ కేసులకు సంబందించిన వారు ఇబ్బంది పడకూడదని ప్రధానంగా గర్భవతులు, డయాలసిస్ , హార్ట్ పేషెంట్లు , ఇతర నాన్ కోవిడ్ కేసుల చికిత్స కు సంబందించి డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ప్రధానంగా కోవిడ్ బారిన పడిన గర్భవతులకు డెలివరీలు చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకొని డెలివరీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ కేసులకు వైద్య చికిత్స అందించే విషయంలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం దృష్టి కి రావడం జరిగిందని, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ కేసులకు వైద్య సేవలు అందించే విషయం లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని, వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని మానవతా దృక్పథం తో ఈ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కోవిడ్ ను అందరూ కలసి కట్టుగా ఎదుర్కోవాల్సి ఉన్నదని తెలిపారు. కోవిడ్ బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అత్యంత ప్రధానమైనదని , కాల్ సెంటర్ లో పనిచేసే వారు వచ్చే కాల్స్ కి తగు సమాధానం ఇస్తూ వారికి గైడెన్స్ చేయాలని తెలిపారు. కోవిడ్ వైద్య సేవలను విస్తృతం చేసేందుకు కోవిడ్ హోస్పిటల్స్ ను, కేర్ సెంటర్లను పెంచుకోవాల్సిన ఆవశ్యకత కలదని డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జిల్లా స్థాయిలో ఇచ్చి భర్తీ చేసేందుకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోవిడ్ హోస్పిటల్స్ ను, కేర్ సెంటర్లలో నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారం ను సరఫరా చేయాలని తెలిపారు. ప్లాస్మా థెరఫీ పై అవగాహన పెంచుతూ ప్లాస్మా ను సేకరించే అంశంపై డాక్టర్లు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. కరోనా నియంత్రణకు ప్రజలలో అవగాహన నిమిత్తం మరియు వైరస్ సొకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి గ్రామ సచివాలయం వద్ద మరియు కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పడకల సంఖ్య , డిశ్చార్జ్ వివరాలను ప్రదర్శించాలని, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని పేషెంట్లకు అందివ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తా మాట్లాడుతూ ఇప్పటివరకు 1 లక్ష 90 వేల టెస్టులు చేయడం జరిగిందని నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు 8 ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ కు వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని మొత్తం 2100 పడకలు కలవని కోవిడ్ కేర్ సెంటర్లు 2260 మంది కలరని , రోజుకు 4000 నుండి 5000 వరకు పరీక్షలు నిర్వహిచడం జరుగుతున్నదని , మూడు కోవిడ్ కేర్ సెంటర్లలో 4500 పడకల సామర్థ్యం కలదని దీనిని 1500 పెంచేందుకు మరియు 800 పడకలను ఆసుపత్రులలో వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం 120 వెంటిలేటర్లు కలవని మంత్రికి వివరించారు.

Post a Comment