శ్రీశైలం పవర్ ప్లాంటులో హఠాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.


శ్రీశైలం: వారంతా పవర్‌ఫ్లాంట్‌ ఉద్యోగులు.. ఎప్పటిలాగానే విధులకు హాజరయ్యారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంతలోనే ఊహించని విపత్తు. తప్పించుకోవడానికి మార్గం వెతికారు. కొందరు బయటపడితే.. మరికొందరికి ఆ రాత్రే కాళరాత్రైంది. మంటల్లో చిక్కుకుని 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. శుక్రవారం నాడు శ్రీశైలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనలో ఓ ఉద్యోగి.. తన భార్యతో చివరి సారిగా మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కళ్ల ముందే చావు గంఠికలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ వైపు మరణం తరుముతోంది.. మరో వైపు కళ్ల ముందే కుటుంబం మెదలుతోంది. ఏలాగైనా సరే కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడాలన్న కోరిక. భార్యకు ఫోన్ చేసి.. ‘10  నిమిషాల్లో నేను చనిపోతున్నా.. నువ్వు, పిల్లలు జాగ్రత్త’ అంటూ ప్రాణాలు వదిలాడు. ఈ హృదయ విదారకరమైన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

👉పిల్లలు జాగ్రత్త అని భార్యకు చెప్పి..

గత రాత్రి శ్రీశైలం పవర్ ప్లాంటులో హఠాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అమాంతంగా మంటలు వ్యాపించి కూర్చున్న చోటే ఏఈ వెంకట్రావు, అమరరాజ ఉద్యోగులు కుప్పకూలిపోయారు. ఆ సమయంలోనే సహోద్యోగులు మంటల్లో కాలిపోతున్న సంఘటన చూసి తాను చనిపోతానన్న సంగతి అర్థమై.. ఏఈ మోహన్ చివరి సారిగా తన అర్ధాంగితో ఫోన్‌లో మాట్లాడారు. ‘చుట్టూ మంటలు వ్యాపించాయి.. 10 నిమిషాల్లో చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్తగా చూసుకో’ అంటూ భార్యతో ఏఈ మోహన్‌ మాట్లాడుతూనే కన్నుమూశారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఏఈ మోహన్ చివరిసారిగా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


తాజా సమాచారం

శ్రీశైలం ప్రమాదంలో 9 మంది మృతి....

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్ర‌మాదంలో లోప‌ల చిక్కుకున్న తొమ్మిది మంది మ‌ర‌ణించారు.. రెస్క్యూ టీమ్ అయిదుగురు మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసు‌కొచ్చారు.. మిగిలిన నాలుగు మృత‌దేహాల‌ను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు..ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో  10 మంది సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు...

మంటల్లో చిక్కుకొని మ‌ర‌ణించిన వారి వివ‌రాలు...

1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్

2.AE వెంకట్‌రావు, పాల్వంచ

3.AE మోహన్ కుమార్, హైదరాబాద్

4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్

5.AE సుందర్, సూర్యాపేట

6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా

7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ

8,9 హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget