సమిష్టిగా పని చేద్దాం.. కరోనాను ఎదుర్కొందాం....ఆళ్ల నాని..... కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో అధికారులందరూ సమిష్టిగా తమ వంతు బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఉన్నత అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశానికి సంబంధించి మీడియాకు అనుమతి నిరాకరించారు
Post a Comment