ఏపీ సర్కారుకు హైకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని తరలింపుపై యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు.. గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై స్టేటస్ కో విధించింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించగా.. ఆయన పదిరోజుల గడువు కావాలని కోరారు. దీంతో అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. దీంతో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారనున్నాయి. అయితే ఆగస్టు 15 నాటికి అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని భావిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

Post a Comment