నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించి, గ్రామ సచివాలయాన్ని సందర్శించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
అర్హులైన లబ్ధిదారులకు సచివాలయంలో అప్పటికప్పుడే ముద్రించి, రైస్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, కౌలు ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రకటించిన సంక్షేమ పథకాలు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు.
👉 సచివాలయాల వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు రైస్ కార్డులు, ఇతర ధృవీకరణ పత్రాలను ముద్రించి అందిస్తున్నాం.
👉 సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సమన్వయంతో పనిచేస్తూ, గ్రామాల్లో ప్రజల సమస్యలు తక్షణం పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.
👉 ప్రభుత్వ పథకాలను జన్మభూమి కమిటీలు లాంటి పార్టీ వ్యక్తులకు పెత్తనం అప్పగించకుండా, అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు ప్రతి నెలా ఒకటో తేదీకల్లా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నాం.
👉చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తే,
జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దానికన్న మిన్నగా అందజేస్తున్నారు.
👉గ్రామాలలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చుక్కల భూమి సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
👉జగన్మోహన్ రెడ్డి గారు మూడు విడతలలో పాఠశాలను పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడానికే నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
👉 ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు సెప్టెంబర్ 5వ తేదీ నుండి జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులందరికీ పుస్తకాలు యూనిఫామ్ లు, బూట్లు, సాక్సులు, బెల్టు,బ్యాగు అందిస్తున్నాం.
👉 అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలి.
👉 ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పారదర్శకంగా పక్షపాత వైఖరి లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే విధంగా పరిపాలన సాగిస్తున్నాం.
👉 గ్రామాల్లో అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ, ప్రజల ఆకాంక్ష మేరకు అవసరమైన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం.
Post a Comment