కత్తెర పురుగు వల్ల ఇబ్బంది పడుతున్నటు వంటి రైతులు.....అగ్రికల్చర్ అసిస్టెంట్ బి శ్రావణి......

కత్తెర పురుగు వల్ల ఇబ్బంది పడుతున్నటు వంటి రైతులు.....అగ్రికల్చర్ అసిస్టెంట్ బి శ్రావణి......

మర్రిపాడు మండల పరిధిలోని  కంపసముద్రం  రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్   బి.శ్రావణి  మాట్లాడుతూ సజ్జ పంట లో  కత్తెర పురుగు ఆశించి నష్ట పరుస్తు నందున (సస్యరక్షణ), రైతులను  ఈ క్రింది తెలిపిన సస్యరక్షణ చర్యలు తక్షణమే చేపట్ట వలసిందిగా కోరారు . ఎకరాకు 4 (నాలుగు) కత్తెర పురుగు యొక్క లింగాకార్షక బుట్టలు పొలంలో అమర్చుకొని కత్తెర పురుగుల యొక్క రెక్కల పురుగుల ఉదృతిని గమనించుకోవాలి .ఈ కత్తెర పురుగుల యొక్క పెద్ద గొంగళి పురుగులను గమనించినట్లైతే : 10 కేజీలు -తవుడు + 2 కేజీలు బెల్లం + 2 లీటర్ల నీళ్లు కలిపి ఒక రాత్రి అంతా పులయ బెట్టాలి అన్నారు. మరుసటి రోజు ఉదయాన ఈ మిశ్రమానికి 250 గ్రాముల లార్విన్ (థైయోడికార్బ్) మందును కలుపుకొని ,చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొక్కల యొక్క మొవ్వులలో వేసుకోవాలి. కత్తెర పురుగుల చిన్న గొంగళి పురుగులను చూసినట్లైతే "ప్రోక్లైమ్ "(ఇమమేక్టిన్ బెoజోయోట్)  మందు ఎకరాకు 80 గ్రాములు చొప్పున మరియు 250 మిల్లీ"లీటర్లు  వేప మందు (1500పిపియం.)ను కలపి మొక్కల మీద పిచ్చికారి చేసు కోవలెను అని తెలిపారు అలాగే అవసరాన్ని బట్టి వారం వ్యవధిలో మరియొక సారి పిచికారి చేసుకోవడం మంచిది. మందు నీళ్లను రెండు లీటర్ల వాటర్ బాటిల్ ను తీసుకొని మూతకి రంధ్రం చేసి పోసుకుంటూపోవాలి . 200 లీటర్ల నీళ్లు కి 80 గ్రాములు ఇమమేక్టిన్  బెంజోయేట్ కలిపి మొవ్వలలో పోయాలని  బి. శ్రావణి పేర్కొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget