దళితులపై జరుగుతున్న దారుణాలను ఖండించిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ..



ఒక్క అవకాశమంటూ ఎక్కువగా దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దళిత ద్రోహిగా మిగిలిపోయారు..  దళితులపై చరిత్రలో ఎప్పుడూలేని విధంగా దారుణాలు జరుగుతున్నాయి...దళిత సమాజం ఇంతగా ఎప్పుడూ అణిచివేయబడలేదు..మళ్లీ పాత భారతదేశంలోకి వెళ్లిపోయాం..  ఇలాంటి పరిస్థితులు రాష్ట్రానికే కాదు..దేశానికే మంచి కాదు.. దళితులు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది... 151 సీట్లు అంటే చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లో వచ్చే పవర్ లాంటిదనుకుంటున్నారా.. దళితులను అణగదొక్కి చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారా..అది మీతరం కాదు.. మీరేదో మహాత్ముడని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు గుణపాఠం చెప్పావు. 
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. మనుబోలు మండలం చెర్లోపల్లి, వెంకన్నపాళెం, వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం, తోటపల్లిగూడూరు మండలం క్రిష్ణారెడ్డిపాళెం తదితర గ్రామాల్లో దళితులు దశాబ్దాలుగా అనుభవించుకుంటున్న భూములను లాక్కునేందుకు ప్రయత్నించడం దుర్మార్గం.. వైసీపీ నేతల ప్రోద్బలంతో అధికారులు ఒత్తిళ్లకు గురిచేసి చెర్లోపల్లిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితులు సృష్టించారు.. వెంకన్నపాళెంలో దళితులను ఈ రోజుకూ కేసుల పేరుతో వెంటాడి వేధిస్తున్నారు.. గ్రామంలో అగ్రవర్ణాల అనుభవంలో ఉన్న భూమిని వదిలి టీడీపీ సానుభూతి పరులైన దళితులనే టార్గెట్ చేస్తున్నారు..
ఎన్నో ఏళ్లుగా తమ అనుభవంలోని భూములను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టుకు వెళ్లి స్టేతెచ్చిన వెంకటయ్యపై పోలీసుల సాయంతో బలప్రయోగం చేశారు..వేధింపులు తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రాణాలతో పోరాడి చివరకు కోలుకున్నాడు.. హైకోర్టుకు వెళ్లాడనే అక్కసుతో వెంకటయ్యపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం దుర్మార్గం. ఆయనతో పాటు మద్దతుగా నిలిచిన వారందరిని, చివరకు మహిళలను కూడా బైండోవర్ చేసుకోవడం, ట్రెస్ పాస్ పేరుతో కేసుల నమోదు,  ఆర్డీఓ కోర్టులో విచారణ పేరుతో ఒక రోజు రాపూరు, మరో రోజు విడవలూరుకు తిప్పడం అధికారులకు తగదు.. తమపై జరిగిన దాడులు, దూషణలకు సంబంధించి బాధిత దళితులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోని పోలీసులు తిరిగి వారినే వేధించడం దుర్మార్గం...  దళిత మహిళ అచ్చమ్మ తన భర్త మస్తానయ్య మరణానంతరం ఆయన పేరుతో ఉన్న భూమిని తనపై మార్చాలని దరఖాస్తు చేసుకుంది. ఆ మహిళ వద్ద ఉన్న పట్టాను చించేసి, భూమి రికార్డులను మార్చేసి ఇళ్ల పట్టాల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన తహసీల్దార్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలి...ఈ రోజు కూడా ఆ మహిళ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించడం అన్యాయం.
రాజీల పేరుతో ఇళ్లకు పిలిపించుకుని తాము చెప్పినట్టు వినకపోతే కేసులు పెడతామని బెదిరిస్తారా.. దళితులు తమ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం పోలీసులకు తగదు.. కోర్టులంటే అధికారులకు, అధికార పార్టీ నేతలకు లెక్కలేకుండాపోయింది.. గ్రామంలో దళితులను రెండు వర్గాలుగా చీల్చి వారి మధ్య విబేధాలు సృష్టించడం తగదు.. గ్రామమంతా తమకు ఇళ్ల స్థలాలు అవసరం లేదంటుంటే వలంటీర్లకు సంబంధించిన 10 కుటుంబాలను ఓ వర్గంగా ఏర్పరచి మిగిలిన వారిపై కేసులు బనాయించి, వేధింపులు గురిచేస్తారా..  పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేదానికంటే ఆ స్థలాల చదును పేరుతో కోట్లు దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు తపన పడుతున్నారు. వీరి అక్రమార్జన కోసం దళితులను వేధింపులకు గురిచేస్తున్నారు..
వెంకన్నపాళెంలో వైఎస్సార్ కాలనీ లేఅవుట్ లెవలింగ్ పేరుతో ఒక కోటి 26 లక్షల రూపాయలు దోచుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎస్టిమేషన్ వేయించారు.. వివాదాస్పదమైన తర్వాత చివరకు రూ.36 లక్షలకు తగ్గించారు...మీరు దోచుకునేందుకు దళితులను పావుగా చేసుకోవడం కరెక్ట్ కాదు... ఈ అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలను పార్టీలకతీతంగా దళిత నేతలందరూ ఐక్యంగా ఖండించాలి...దళిత శంఖారావం పూరించాలి..మీ వెనుక నడిచేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget