సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలల పొడిగింపు
• ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
• ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగింపు
అమరావతి, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ లో సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆమె పదవీ కాలాన్ని జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ మూడు నెలలకు పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30 వ తేదీ ( సెప్టెంబర్ నెలాఖరు)న సీఎస్ పదవీ కాలం ముగియనుండడంతో మరో మూడు నెలల కాలం పాటు సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ సీఎస్ పదవీ కాలం పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు.

Post a Comment