ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంత చేసేందుకు, అది మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి. అందులో భారత్ కంపెనీలు ముందున్నాయి. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ అందరికంటే ముందుగా ఉంది. తాజాగా
భారత్ బయోటెక్ తయారు చేసిన COVAXIN త్వరలో క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. అంటే మనుషుల మీద ప్రయోగించనున్నారు. వ్యాక్సిన్ కోసం మనుషుల మీద ప్రయోగాలకు అనుమతి పొందిన తొలి భారతీయ సంస్థ ఇదే కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ఐసీఎంఆర్ ఏడు సంస్థలకు లేఖ రాసింది. ఈ ఏడు వైద్య సంస్థల్లోనే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన COVAXINను మనుషుల మీద ప్రయోగిస్తారు. దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ను జూలై 7వ తేదీలోగా పూర్తి చేయాలంటూ ఐసీఎంఆర్ ఆయా సంస్థలకు రాసిన అంతర్గత లేఖలో పేర్కొంది. అలాగే, ఆగస్ట్ 15న దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ క్రమంలో భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లాతో వెబ్ సైట్ ఇంటర్వ్యూ నిర్వహించింది. అందులోని ముఖ్యమైన అంశాలు.
వ్యాక్సిన్ తయారు చేయడానికి మీరు అవలంభించిన విధానం ఏంటి? మనుషులపై ప్రయోగం చేసేందుకు CDSCO అంగీకారం తెలపడానికి ముందు జరిగిన వివిధ దశలు ఏంటి? ఐసీఎంఆర్ సేకరించిన వైరస్‌ను పూణెలోని వైరాలజీ ల్యాబ్ నుంచి తీసుకుని వెళ్లి దానికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నించింది. వ్యాక్సిన్ తయారు చేయడానికి కావలసిన జీఎంపీని భారత్ బయోటెక్ చాలా త్వరగా సాధించింది. కేవలం 40 రోజుల్లోనే మొదటి సెట్ జీఎంపీ బ్యాచ్‌ను సిద్ధం చేశాం. ఆ తర్వాత ప్రి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. WHO, భారత స్వతంత్ర విలువల కమిటీలోని షెడ్యూల్ వై నిబంధనల ప్రకారం కో వ్యాక్సిన్‌ను జంతువుల మీద ప్రయోగించాం. COVAXIN అనేది జంతువుల్లో ఎలాంటి హానికారం కాదని నిర్ధారణ అయింది. ఆ తర్వాత క్లినికల్ డెవలప్‌మెంట్ మీద దృష్టి సారించాం.
వ్యాక్సిన్‌లో ఏమి ఉంటుంది?
COVAXIN క్రీయాశీలక టీకా వెరో-సెల్ ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయబడింది. ఈ క్రియాశీలక టీకా అనేదానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
మనుషుల్లో కొందరి మీద కంటే మరికొందరి మీద బాగా పనిచేస్తుందా? ఆ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది?
వాస్తవానికి ఈ క్రియాశీలక టీకాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ఫ్లూ, పోలియో, ర్యాబిస్, జపనీస్ ఎన్సెఫలిటీస్ వంటి వాటికి కూడా ఇదే టెక్నాలజీతో క్రియాశీలక వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఒకసారి దీన్ని మనుషుల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు వైరస్ సోకే, లేకపోతే ప్రతిరూపం దాల్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అది చనిపోయిన వైరస్ కాబట్టి. ఇది రోగనిరోధక వ్యవస్థను చనిపోయిన వైరస్ వలె పనిచేస్తుంది. వైరస్ వైపు యాంటీబాడీ ప్రతిస్పందనను పెంచుతుంది.వ్యాక్సిన్‌ను ధర నిర్ణయించే అధికారం ఏ సంస్థకు ఉంటుంది? ఒకవేళ అది భారత్ బయోటెక్‌కే ఉంటే వ్యాక్సిన్ ధర ఎంత ఉండొచ్చు?
సామాజికంగా మొగ్గు చూపే సంస్థగా, ప్రజారోగ్యంపై దృష్టి కేంద్రీకరించిన సంస్థగా, ప్రపంచ స్థాయి టీకాలను సరసమైన ధరలకు అందించడానికి మేము ప్రయత్నిస్తాము. వరల్డ్ క్లాస్ వ్యాక్సిన్‌ను భరించగలిగే ధరలకే ఇస్తామని మేము ఇంతకు ముందే చెప్పాం. గతంలోనూ అలాగే చేశాం. ఇప్పుడు COVAXIN విషయంలో కూడా అలాగే ముందుకు వెళ్తాం. ధర విషయంలో ఏదైనా ప్రకటన చేయడం చాలా తొందరగా ఉందని చెప్పాలి.

Post a Comment