ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు కీలక సభ్యులను పక్కన పెట్టారు. సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి తప్పిస్తూ సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పించిన ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు సాధారణ పరిపాలన శాఖ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్‌కు రవాణా, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి పరిధిలో జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ (ఖర్చులు) ఉంటాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఆర్డర్స్ జారీ అయ్యాయి.
Post a Comment