మీక్కూడా కరోనా వుండే ఉంటుంది ...

మీక్కూడా కరోనా వుండే ఉంటుంది
అవును ... ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మందికి కరోనా వచ్చింది.. కానీ లక్షణాలు కనిపించడం లేదు.. 100 శాతం వ్యాపించాక, టెస్ట్ చేయించి , ట్రీట్మెం ట్ తీసుకునేలోపే కింద పడిపోయి , రిస్క్ కేసులుగా మారుతున్నారు.
నా కొలీగ్ జర్నలిస్ట్ ఒకామెకు ఏ లక్షణాలు లేవు. ఛానెల్ వారిచ్చిన టోకెన్ తో అయిష్టంగా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ..షాక్ .. అయినా కోర్స్ వాడింది.. మొన్న ఓ డాక్టర్ తో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఇది " చాలామందికి కోవిడ్ సోకినా లక్షణాలు కనిపించట్లేదు.. వాళ్ళల్లో లక్షణాలు కనిపించకున్నా వైరస్ ప్రభావం ఉండి తీరుతుంది.. వారిలో వుండే సహజ వ్యాధి నిరోధకత వల్ల, వైరస్ జాతిని బట్టి కూడా ఇలా జరుగుతుంది.. ఎప్పుడైతే వైరస్ ప్రభావం పెరుగుతుందో అప్పుడు వ్యాధి లక్షణాలు లేని వారి శరీరంలో  వైరస్ అమాంతంగా, ఒకేసారి, ముప్పేట దాడి చేస్తుంది. దీంతో తల్లడిల్లిపోయి ఆసుపత్రి గేట్ ముందే పడిపోతున్నారు.. ఇలా పడిపోయిన కేసుల్లో 80శాతం కోలుకోని వారున్నారు.. ఇప్పుడే సోషల్ కాంటాక్ట్ లోకి కరోనా వచ్చింది.. ఊరికో రెండు కేసులు బయట పడుతున్నాయి.. మా ఊర్లో ఇప్పటికే 4 కేసులు బయట పడ్డాయి..
మరేం చేయాలి?
ఇలా చేయండి
మీలో కోవిడ్ లక్షణాలు లేకున్నా సరే , మీ కుటుంబం ఓ నెలరోజుల పాటు జింకో విట్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ నెల కోర్స్ రోజూ వాడండి.. జెనరిక్ మందుల షాప్ లేదా ఏదైనా కంపెనీ మందుల షాపుల్లో దొరుకుతాయి. చాలా చౌక.. రోజు ఓ మల్టీ విటమిన్ టాబ్లెట్ వేసుకోండి.. పూర్తి ఆరోగ్యం తో ఉన్నవారు కూడా ఇవి వాడొచ్చు.. ఏవైనా విటమిన్ లోపం రోగాలున్నా పోతాయి.. ఇక ఇంట్లో సి విటమిన్ కి సంబంధించి నిమ్మ, నారింజ, ఉసిరి లాంటివి ఉంటే వారానికి మూడు తినండి.. వీలైతే ఉదయం లేదా సాయంకాలపు ఎండలో ఓ గంట ఏదన్నా, పని, వ్యాయామం చేయండి.. మీలో కోవిడ్ ఉంది.. దాన్ని జయిస్తున్నాను అనే సంకల్పంతో ఇది ఓ నెల రోజులు పాటించి గండం నుంచి గట్టెక్కండి. మీలో కోవిడ్ వైరస్ వచ్చినా అది మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టదు.. 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget