గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు ..ప్రొహిబిషన్ అండ్ఎక్సైజ్‌ శాఖ శాఖ సిఐ డి శ్రీధర్ బాబు

గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వా కాడు సర్కిల్
ప్రొహిబిషన్ అండ్ఎక్సైజ్‌ శాఖ శాఖ సిఐ డి శ్రీధర్ బాబు హెచ్చరించారు, మంగళవారం వాకాడు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ శాఖ  కార్యాలయం వద్ద అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతూ పోలీసు కేసులు నమోదు నమోదు అయిఉన్న వారికి  కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా సి ఐ శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతూ పోలీసులకు పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితులు లేవన్నారు, కోర్టు లలో కూడా శిక్షలు తో పాటు భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది అన్నారు, ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు జరుపుతూ పట్టుపడిన వారు సత్ప్రవర్తన తో జీవించాలని ఆయన కోరారు, మద్యం షాపులు నుండి బాటిళ్లు కొనుగోలు చేసి షాపులు మూసివేసిన తరువాత అధిక రేట్లకు విక్రయాలు జరపడం చట్టవ్యతిరేకం అన్నారు,ఎవరూ అయిన మద్యం బాటిళ్లు తో పట్టుబడితే చర్యలు తప్పవన్నారు, వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకొని జీవించాలని అంతే తప్ప అక్రమ మద్యం విక్రయాలు జోలికి వెళ్లకుండా ఉండాలి అనీ ఆయన కోరారు, మద్యం విక్రయాలు జరిపే వారు  ఇంకనైన ఆ పనులు ఆపివేసి సత్ప్రవర్తన తో ఉంటే వారిపై ఉన్న కేసుల్లో న్యాయం చేస్తాం అనీ, అదేవిధంగా గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరిపేవారి వివరాలు తెలియజేయాలి అనీ ఆయన కోరారు,గ్రామాల్లో మద్యం విక్రయాలు జరిపే వారిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది అనీ అందువలన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అందుకు తగిన గుణపాఠం చెబుతాం అనీ హెచ్చరించారు, గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరిపే వారి వివరాలు ఈ క్రింది సెల్ ఫోన్ నంబర్లు కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు,  సి ఐ, ఎస్సై సెల్ నంబర్లు9440902514,9985363591 ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ఎక్సైజ్‌ శాఖ ఎస్సై శశి కుమార్, సిబ్బంది రమణయ్య,కోటయ్య,మోహన్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget