చిత్తూరు, జూలై 21 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈ నెల 22 వ తేది బుదవారం నిర్వహించబోయే జగనన్న పచ్చ తోరణం 71 వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చిత్తూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలను నాటి ఆ మొక్కలను సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడం వల్ల వైరస్ మరియు కాలుష్యం అనేది దూరం అవుతుందని తెలిపారు. మొక్కలు ఒక సంపద అని చెప్పారు. ఈ నెల 22 వ తేది జగనన్న పచ్చ తోరణంలో భాగంగా అటవీ శాఖ వారిచే చేపట్టే 71 వ వనమహోత్సవం సందర్భంగా గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఈ ఏడాది లో 20 కోట్ల మొక్కలు నాటెందుకు కార్యాచరణాన్ని సిద్దం చేశారని తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారని అలాగే చెట్లను సరఫరా చేస్తున్నారని చెప్పారు. చెట్లు నాటడం వల్ల ఆరోగ్యం భాగుంటుందని రాష్ట్రం మొత్తం పచ్చదనం చేకూరుతుందని వివరించారు. సోషల్ ఫారెస్టరీ డి.ఎఫ్.ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22 వ తేది జగనన్న పచ్చ తోరణం లో భాగంగా అటవీ శాఖ చేపట్టే 71 వ వన మహోత్శవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరులో ప్రారంబించనున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారని తెలిపారు. ప్రతి ఏటా పచ్చ దనం పెంచాలనే ఉద్దేశ్యంతో అటవీ శాఖ ముందుకు వెళుతూ ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 39.27 శాతం ఫారెస్ట్ ఉందని చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, అటవీ శాఖ తదితర శాఖల సమన్వయంతో 16,431 హెక్టార్లలో మొక్కలు నాటుతామని తెలిపారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమoలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే కోవిడ్ ఉన్న కారణంగా ప్రజలందరూ ప్రభుత్వ మార్గ నిర్దేశాలను పాటిస్తూ విధిగా మాస్కులు ధరించి అలాగే భౌతిక దూరం పాటిస్తూ మొక్కలు నాటాలన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో చిత్తూరు ఈస్ట్ మరియు వెస్ట్ డి.ఎఫ్.ఓ.నరేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..... ఎమ్మెల్యే శ్రీనివాసులు....

Post a Comment