కరోనాతో యుద్ధం చేస్తామంటూ పాట రాసి..
చివరికి ఆ కరోనాతోనే మృతి చెందిన కవి నిస్సార్..!
కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని పాట రాసిన కవి..
ఈ పాటను పాడిన వందేమాతరం శ్రీనివాస్..
టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్‌గా ఉద్యోగం..
కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ మహమ్మారి మన దరికి చేరకుండా తరిమికొట్టాలని పాట రాసి ప్రజల్లో అవగాహన కల్పించిన ప్రముఖ కవి, గాయకుడు నిస్సార్ చివరకు ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు..
ఆయన రాసిన 'కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన' పాట ఇటీవల ప్రజల్లోకి బాగా వెళ్లింది. నిస్సార్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడారు.
మార్చి నెల చివరలో ఈ పాట విడుదలయింది..
130 కోట్ల జనం కలిసి కరోనాను మట్టి కరిపిస్తారని ఆయన పాడిన ఆ పాటకు అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఆయనే ఆ కరోనా బారినపడి మృతి చెందడం పట్ల అభిమానులు, సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు..
యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన కవి నిస్సార్.. టీఎస్ఆర్టీసీలో కంట్రోలర్‌గానూ విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆయన జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు.

Post a Comment