నాన్న గారు మరణం లేని మహానేత: ఇడుపులపాయ నుంచి జగన్ ట్వీట్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఇడుపులపాయలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇడుపులపాయ నుంచి ట్వీట్ చేశారు. ఇవాళ నాన్న గారి 71వ జయంతి... ఆయన మరణంలేని మహానేత అంటూ కీర్తించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిలా నిలిచిపోతారని కొనియాడారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇడుపులపాయ వచ్చిన సందర్భంగా సీఎం జగన్ ఇక్కడి ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ క్లాస్ రూములను, విద్యుత్ వ్యయాన్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు.దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైయస్సార్ కు, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ గారు..అనంతరం.. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రచించిన ''నాలో నాతో వై.ఎస్.ఆర్'' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్

Post a Comment