మైనర్ బాలిక అత్యాచారం పై పూర్తి విచారణ జరిపిస్తాం/ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ.

మైనర్ బాలిక అత్యాచారం పై పూర్తి విచారణ జరిపిస్తాం/
 జరిగిన సంఘటన అమానుషం/
 ప్రభుత్వం తరఫున మహిళా కమిషన్ బాధితురాలికి అండగా ఉంటుంది/
 ఎవరినీ ఉపేక్షించేది లేదు/


 రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ.

 ఆదివారం  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేశారు.
ఇటీవల కోరుకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక రాజమహేంద్రవరంలో అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో చైర్ పర్సన్ ఆ బాలికను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని,  బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి మహిళా కమిషన్ తరఫున భరోసా ఇచ్చారు.
 ఈ సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన అమానుషమని, సమ సమాజం నకు తలవంపులు అన్నారు. పేద కుటుంబానికి చెంది అతి కష్టం మీద పదవ తరగతి వరకు చదువుకొని, తన కుటుంబానికి సాయపడాలని చిన్న ఉద్యోగం చేసుకుంటున్న   బాలికను చిత్రహింసలు పెట్టి,  అత్యాచారానికి గురి చేయడం దారుణమన్నారు. ఈ కేసులో మహిళా కమిషన్ పూర్తి విచారణ జరిపిస్తుంది అన్నారు. ఆ కుటుంబానికి మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు. అర్బన్ ఎస్పీ వారితో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడే విధంగా కృషి చేస్తామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు, చైర్ పర్సన్ తో బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి  రాజ్యలక్ష్మి బాధితు రాలకు యథాప్రకారం ఐసిడిఎస్ ద్వారా నష్ట పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. సి డి పి ఓ సిహెచ్ వి నరసమ్మ, ఐ సి పి ఎస్ డి సి పి ఓ సిహెచ్ వెంకట్రావు, స్థానిక నాయకులు కానుబోయిన సాగర్, నక్కా  శ్రీ నగేష్, లాయర్ హసీనా, నిరీక్షణ జేమ్స్, మార్తి లక్ష్మీ, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎల్.వి.ప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరావు, మీసాల గోవిందు, నందం స్వామి, ఆర్ శైలజ, పి  ప్రకాష్ కుమారి, చంద్ర అంగన్వాడీ టీచర్లు చైర్ పర్సన్ తో ఉన్నారు.I&PR.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget