పొదలకూరు మండల కేంద్రంలో అగ్రికల్చర్ పాలిటెక్నీక్ కళాశాల నూతన భవనాలను ప్రారంభించిన, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,



పొదలకూరు మండల కేంద్రంలో అగ్రికల్చర్ పాలిటెక్నీక్ కళాశాల నూతన భవనాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు 1 కోటి 70 లక్షలతో నిర్మించిన భవనాలకు ప్రారంభోత్సవం చేయడం సంతోషకరం.

👉 స్వర్గీయ ఏ.సీ.సుబ్బారెడ్డి గారు మంత్రిగా, మా తండ్రి కాకాణి రమణారెడ్డి గారు సమితి అధ్యక్షులుగా ప్రారంభమైన చిరుధాన్యం పరిశోధనా కేంద్రం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల స్థాయికి ఎదగడం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది.

👉 మహానేత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యునిగా ఈనాటి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఆనాడు రైతు సదస్సు నిర్వహించడం జరిగింది.

👉 రైతు సదస్సులో ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరిన వెంటనే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పొదలకూరు మండల కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయడం జరిగింది.

👉 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఈరోజు నిర్మించుకో గలిగామంటే రాజశేఖర్ రెడ్డిగారి దయ, ఆనం రామనారాయణ రెడ్డి గారి కృషి ఫలితం.

👉 నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా తాత్కాలిక భవనాలలో ప్రారంభమైన కళాశాల మళ్లీ నేను తిరిగి శాసనసభ్యునిగా శాశ్వత భవనాలను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

👉 అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల రూపుదిద్దుకోవడంలో ఆనాటి ప్రిన్సిపాల్ కోదండరామి రెడ్డి గారి పాత్ర మర్చిపోలేనటువంటిది.

👉 వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.

👉 చంద్రబాబు ఏ నోటితో విజన్ 2020 అన్నాడో తెలియదు గానీ, కరోనాతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి సమగ్రంగా సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 100 కోట్లు మంజూరు చేయమని కోరితే, ఇప్పటికే 60 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు.

👉 రైతుల సంక్షేమం కోసం ఎవరూ ఊహించని విధంగా, రైతాంగం ఆశించిన దానికన్న మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు.

👉 గతంలో అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు శంకుస్థాపనల పేరిట శిలాఫలకాలకే పరిమితమయ్యాయి తప్ప, ప్రజలకు అందించింది శూన్యం.

👉 అభివృద్ధి అంటే చూసి ప్రజలు హర్షించే విధంగా ఉండాలి తప్ప, మాటలకు, కాగితాలకు పరిమితం కాకూడదు.

👉 సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తా

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget