కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి : కార్మిక సంఘాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు ఆత్మకూరు బస్‌స్టాండు వద్ద శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు జి నాగేశ్వరరావు, కె అజయ్ కుమార్, ఎఐటియుసి జిల్లా నాయకులు రామరాజు మాట్లాడుతూ కరోనా నియంత్రణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నాయని అన్నారు. లాక్ డౌన్ కారణంగా అసంఘటితరంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. కరోనా సాకు చూపి ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా దివాళాతీసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రకటించిన 20 లక్షల కోట్లలో కార్మికులకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా లేదని అన్నారు. వలస కార్మికుల చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా వారిని భిక్షగాళ్ళగా మార్చాయని విమర్శించారు. అసలే ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించేలా, వేతనాల్లో కోతలు విధించకుండా, ఎవరిని ఉద్యోగాల నుండి తొలగించకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నియంత్రణ సేవలలో ఉన్న ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్కీం వర్కర్స్, కాంటాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు, వాలంటీర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వాలనీ, జీవిత భీమా సౌకర్యం కల్పించాలని, ఒక నెల వేతనం బోనస్ గా ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం మానుకోవాలని, కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేయాలని,
భవన నిర్మాణ, ఆటో, రవాణా రంగాల కార్మికులకు 10000/-రూపాయలు ఇవ్వాలనీ, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలను వెంటనే సవరించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఫ్రీజ్ ను రద్దు చేయాలని, నష్టదాయకమైన విద్యుత్ చట్ట సవరణ 2020 ని రద్దు చేయాలని, కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగులకు కార్మికులకు జీవిత భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్, AIFTUరాష్ట్ర నాయకులు కిషోర్ బాబు, నాయకులు యానాదయ్య, సిఐటియు నాయకులు జి జయరామ్, మురళి, రియాజ్, భాషా, ఎం సుధాకర్, సుబ్బారెడ్డి, నాగూర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment