ప్రభుత్వ ఆసుపత్రి, అపోలో ఆసుపత్రి, సూపరిండెంట్ లు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.

-
ప్రభుత్వ ఆసుపత్రి, అపోలో ఆసుపత్రి, సూపరిండెంట్ లు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.

--- కోరుతూ అర్ధనగ్న నిరసన.

 ---చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, అపోలో ఆస్పత్రిలో, పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు  ఆస్పత్రి ఆవరణలో ఏ.పీ.మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం  యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి చంద్ర, కార్యదర్శి శంకర్ నాయకత్వంలో జరిగింది. నిరసన కార్యక్రమం ఉద్దేశించి ఏఐటియుసి, గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 549 జి.ఓ, ప్రకారం వేతనాలు పెంచి పీ.ఎఫ్, ఇ.ఎస్.ఐ, ఉచిత బీమా, సౌకర్యం కల్పించాలని కోరుతూ గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్న  ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ గాని, అపోలో ఆసుపత్రి సూపర్డెంట్ గాని, పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని వాపోయారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, తమ ప్రాణాలను  సైతం లెక్క చేయకుండా, పేషెంట్లకు సేవ చేస్తున్నా శానిటేషన్, సెక్యూరిటీ, సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోవడం చాలా దారుణం అన్నారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో 20 తారీకు నుండి విధులకు గైర్హాజరు అవుతున్నట్లు దీనికి బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్, అపోలో ఆసుపత్రి సూపర్డెంట్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి చంద్ర, శంకర్, రాజారామ్, మణికంఠ, రవిరెడ్డి, మునిరత్నం, రంజిత, చిలకమ్మా, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget