పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి...సీఐ గంగాధర్ రావు
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రతి విధిగా మొక్కలు నాటాలని పొదలకూరు సీఐ గంగాధర్ రావు పేర్కొన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పొదలకూరు పంచాయతీ పరిధిలో పేదలందరికి ఇల్లు పథకం లో చిట్టేపల్లి తిప్ప వద్ద ఏర్పాటు చేసిన లే అవుట్ లో పొదలకూరు పోలీసులు సుమారు 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ రావు మాట్లాడుతూ వాతావరణం లో కాలుష్యం పెరిగి విషతుల్యంగా మారుతోందన్నారు. ప్రజారోగ్యం కోసం ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు, కండలేరు ఎస్ఐలు రహీం రెడ్డి, లేఖాప్రియాంక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment