విక్రయ కేంద్రాల్లో పటిష్ట నిబంధనలు అమలు
- కమిషనర్ టి.బాపిరెడ్డి
కరోనా వైరస్ నివారణలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాల్లో పటిష్ట నిబంధనలు అమలుచేస్తూ వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు వహిస్తున్నామని కమిషనర్ టి.బాపిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ఎస్వీజిస్ కళాశాల ప్రాంగణం, నవాబు పేట వ్యవసాయ మార్కెట్టు విక్రయ కేంద్రాల నిర్వహణ తీరును కమిషనర్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించి నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేసారు. కూరగాయల విక్రయ కేంద్రాలలో వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో ప్రతీ వినియోగదారుడు సూచించిన దూరం పాటిస్తూ క్యూ పద్ధతిలో కొనుగోలు చేయాలని, కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం లేకుండా అన్ని మార్కెట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్పీ, ఆర్డీవో, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment