సర్వేపల్లి నియోజకవర్గంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో

నెల్లూరు జిల్లా,


సర్వేపల్లి నియోజకవర్గంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు ఆచార్య యన్.జి.రంగా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్  వై.మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

మనుబోలు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకాణి.

వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ లను ప్రారంభించిన మధుసూదన్ రెడ్డి గారు, శేషగిరి బాబు గారు, ఎమ్మెల్యే కాకాణి.

సర్వేపల్లి నియోజకవర్గంలో వినూత్న రీతిలో నూతన పద్ధతుల్లో వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టిన ఆదర్శ రైతులకు సన్మానం.

వ్యవసాయ శాఖలో అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కోదండరామిరెడ్డి గారికి ఘన సన్మానం.

రైతుభరోసా కేంద్రాల ద్వారా పలువురు రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుట్టిన రోజు రైతులకు పండుగ రోజు.

👉ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రైతుల అభివృద్ధి, సంక్షేమం అంటేనే  రాజశేఖర్ రెడ్డి గారి పాలన గుర్తుకు వస్తుంది.

👉2004కు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదు.

👉రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పై పెట్టి రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా నిలిచారు.

👉తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపించడం, పోలీసు కేసులు బనాయించి వేధింపులకు గురిచేసి రైతులను అవమానపరిచారు.

👉వై.యస్.ఆర్.హయాంలో సకాలంలో రుణాలు చెల్లించి, రుణమాఫీ ద్వారా లబ్ధి కలగని   రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో రైతుకు 5 వేలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.

👉 రాజశేఖర్ రెడ్డి లాంటి మహనీయుడి పుట్టిన రోజు రైతు దినోత్సవం గా జరుపుకోవడం మన అదృష్టం.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల్లో మహానేత రాజశేఖర్ రెడ్డి దయవల్ల, సాగు నీరు అందించడంతో ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు.

👉 రైతాంగం శ్రేయస్సు కోసం సొంత జిల్లా కడపలోని పలు గ్రామాలను ఖాళీ చేయించి, సోమశిల రిజర్వాయరుకు 78 టీ.ఎం.సీ.ల సామర్థ్యం పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.

👉మహానేత మరణం తరువాత  రైతులు అన్ని విధాలా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి.

👉 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పాలనను చూస్తున్నాము.

👉చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడు.

👉 జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీ కన్నా మిన్నగా, ముందుగా అమలు చేసి, రైతులపై ఆయనకున్న ప్రేమను కనబరిచారు.

👉రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ప్రభుత్వం చేయూతనందిస్తుంది.

👉ఆక్వా రైతులను చంద్రబాబు మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు.

👉మహానేత ఏ లోకంలో ఉన్నా రాష్ట్ర ప్రజల హృదయాల్లో, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

👉రాజశేఖర్ రెడ్డి గారిని కోల్పోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపం అయితే జగన్మోహన్ రెడ్డిగారి లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం దేవుడిచ్చిన వరం

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget