తుగ్గలి ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలిలో శుక్రవారం రోజున వాహనాల తనిఖీలో భాగంగా క్వారీలలో పేల్చడానికి వాడే పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు.తుగ్గలి మండల పరిధిలోని రైల్వే స్టేషన్ క్రాస్ రోడ్ వద్ద పత్తికొండ రూరల్ సీఐ డి.వి.నారాయణ రెడ్డి వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా ఏపీ02 టి.ఈ 3531 గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను సీఐ నారాయణరెడ్డి పట్టుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా సిఐ నారాయణ మాట్లాడుతూ 280 బాక్సుల పేలుడు పదార్థాలు ఆస్పరి నుండి తుగ్గలి కి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలియజేశారు.ఒక్కొక్క బాక్స్ నందు 9 బూస్టర్ లు ఉన్నాయని తెలియజేశారు.ఈ బూస్టర్ లతో పాటుగా పేలుడు పదార్థాలైన జెల్లీలు కూడా ఉన్నాయని సిఐ తెలియజేశారు
వాహనాల తనిఖీలో పట్టుబడ్డ పేలుడు పదార్థాలు

Post a Comment