శానిటైజర్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
ఇప్పటి వరకు సరైన టీకా, మందులు లేని కరోనావైరస్ కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రదత పాటించడమే మార్గం.. వ్యక్తిగత శుభ్రతలో ప్రధానమైంది వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇది బయటకు వెళ్లినప్పుడు సాధ్యం కాదు కాబట్టి.. శానిటైజర్ వాడడం. దీంతో.. ఒక్కసారిగా శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. కరోనా సమయంలో ఇది కీలకమైన అస్త్రంగా మారిపోయింది.. ఎవ్వరి బ్యాగులో చూసినా అదే.. ఏ జేబులో చూసినా అదే.. ఏ వాహనంలోనైనా ఉండాల్సిందే.. ఇక కార్యాలయాలు, షాపింగ్ మాల్స్.. ఇలా వేటి ముందైనా శానిటైజర్ దర్శనమిస్తోంది.. నిత్యావసర వస్తువుల్లో కూడా శానిటైజర్ భాగమైపోయింది.. ఎందుకంటే.. ప్రతీ ఇంట్లోనూ వాడేస్తున్నారు... దీంతో.. కొరత ఏర్పడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం.
వాటిలో ముఖ్యంగా.. శానిటైజర్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు కూడా ఇచ్చేశారు... ఇక, శానిటైజర్ ధరలపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. 200 ఎంఎల్ శానిటైజర్ ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని ఆదేశించింది. ఎక్స్‌పైరీ డేట్ దాటిన శానిటైజర్ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. శానిటైజర్ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండగా.. దానిపై వస్తున్న విజ్ఞప్తులతో.. ఆ నిబంధన కూడా ఎత్తివేసింది కేంద్రం.

Post a Comment