నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవు ఆర్డీవో సరోజిని.
నాయుడుపేట లో రేపు ఉదయం7గంటల నుంచి 12గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి అని అన్నారు.
ఇక నుంచి ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో దుకాణాలు మూసివేయాలని అంతేకాకుండా నాన్ వెజ్ కూడా అమ్మరాదని అన్నారు.
నాయుడుపేటలో నిన్న కరోనాతో ఇద్దురు మృతి చెందడం జరిగిందని అంతేకాకుండా రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఆంక్షలు కఠినతరం చేయడం జరిగిందని తెలిపారు.
పట్టణంలో వ్యాపారస్తులు కరోనా నియంత్రణకు సహకరించాలని
అధిక శాతం డోర్ డిలివరికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారస్తులకు సూచించారు.
దుకాణాల వద్ద శానిటైజర్లతో పాటు వ్యాపారస్తులు, వినియోగదారులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని అలాగే ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో , నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై వెంకటేశ్వరరావు,వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment