వీధి బాలలు, అనాథ మరియు నిరాదరణకు గురైన బాలబాలికలు కరోనా బారిన పడకూడదు... జిల్లా ఎస్.పి.సెంథిల్కుమర్.....

వీధి బాలలు, అనాథ మరియు నిరాదరణకు గురైన బాలబాలికలు కరోనా బారిన పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ ముష్కాన్ నిర్వహణ..
  –
జిల్లా ఎస్.పి.సెంథిల్కుమర్.....
        వీధి బాలలు, అనాథ మరియు నిరాదరణకు గురైన బాలలు ఎవరూ కరోనా బారిన పడకుండా పరిరక్షిక్షుటకు ఒక వారం రోజుల బాటు ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం ను జిల్లా వ్యాప్తంగా నిర్వహించమని జిల్లా ఎస్పీ  ఎస్.సెంథిల్ కుమార్,  గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ 14 వ తేదిన ప్రారంభమైన  ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం 20 తేదీ వరకు కొనసాగిందని, ఈ వారం రోజుల్లో 250 ( 228 బాలురు + 22 బాలికలు) మంది చిన్నారులను రెస్క్యు చేయడం జరిగినదని, కరోనా నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగినదని, రెస్క్యు చేసే బృందాల సభ్యులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే రెస్క్యు కాబడిన పిల్లలకు సైతం మాస్కులు ధరింపజేసి, హ్యాండ్  శానిటైజర్లు వినియోగింప చేసామని తెలిపారు.  పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మికశాఖ, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ మరియు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల సమన్వ యంతో బృందాలు ఏర్పాటు చేసి ఈ రెస్క్యు ఆపరేషన్ ను నిర్వహించమని తెలిపారు.  ప్రతీ పోలీసు సబ్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న షెల్టర్ హోంకు రెస్క్యు కాబడిన పిల్లలను తీసికెళ్లి వైద్య సిబ్బంది ద్వారా కోవిడ్ పరీక్షల కోసం శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపినమని, ఈ పరీక్షలలో ఒక అబ్బాయి కి మినహా ఎవ్వరికి కరోనా సోకలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 14 వ తేదిన  చిత్తూరు పట్టణం నాగయ్య కళాక్షేత్రం వద్ద చిత్తూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి రెస్క్యు చేయబడిన 15 మంది పిల్లలతో ఎస్.పి  స్వయంగా ముచ్చటించి వారికి మందులు, గ్లావుజు లు, మాస్క్ లు అందజేయడమైనది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget