ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పాదయాత్రలో ఔట్ సోర్శింగ్ ఉద్యోగుల పరిస్థితి గమనించిన తర్వాత.., వారికి ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు.., ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా వారికి జీతం అందేలా చేయడం కోసం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టర్ల అవినీతికి అడ్డుకట్ట వేయడంకోసం..., ఈ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. అనంతరం ఔట్ సోర్శింగ్ ఉద్యోగులకు.. ఆప్కాస్ నియామక పత్రాలను అందించారు.
ఈ
వీడియో కాన్ఫరెన్స్ లో నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ పి.అనిల్ కుమార్, కలెక్టర్ శ్రీ ఎం.వి.శేషగిరి బాబు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే..., ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని మంత్రి శ్రీ అనిల్ కుమార్ తెలిపారు. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్... ప్రారంభించడంతో..., ఇన్ని రోజులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడిందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో..., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, మహిళకు 50 శాతం పోస్టులు దక్కేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. పాదయాత్ర సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయడంతో పాటు.., అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పూర్తి జీతాలు సమయానికి అందుతాయని, ESI, EPF కూడా ఉద్యోగులకు అందుతుందన్నారు. ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం, ఉద్యోగం వచ్చిన తర్వాత జీతాల కోసం కాంట్రాక్టర్లకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం కలెక్టర్ తో కలిసి ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ నియామక పత్రాలను.., ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి శ్రీ పి.అనిల్ కుమార్ అందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ ఎం.వి.శేషగిరి బాబు మాట్లాడుతూ...,
నెల్లూరు జిల్లాలో 1800 మందికి కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ ద్వారా నియామక పత్రాలు అందిస్తున్నామని, ఇకపై భర్తీ చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా కార్పొరేషన్ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శ్రీ శీనా నాయక్, అధికారులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment